సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పబ్లిక్‌ టాయిలెట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి

1 గంట క్రితం

Two youths die after inhaling toxic gas in a public toilet.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ముంబయిలోని గోరేగావ్‌ తూర్పు రామమందిర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. పబ్లిక్‌ టాయిలెట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను ప్రభాకర్‌ ధనివర్‌ (24), భావిక్‌ దేశాయ్‌ (18)గా గుర్తించారు. గణేశ్‌ నిమజ్జనం అనంతరం .... శుక్రవారం రాత్రి ఇద్దరూ టాయిలెట్‌కు వెళ్లారు. అరగంటైనా తిరిగి రాకపోవడంతో సహచరులు వెళ్లి టాయిలెట్స్ లో చూడగా, తీవ్ర రసాయన దుర్వాసన మధ్య అపస్మారక స్థితిలో ఇద్దరూ కనిపించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టాయిలెట్‌ పక్కనే ఉన్న పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు డ్రైనేజీలోకి చేరి విషవాయువు ఏర్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్