- ‘పరివర్తన రాజనీతి పార్టీ’గా నామకరణం
- ‘కొత్త తరం.. కొత్త పార్టీ’ నినాదంతో రాజకీయాల్లోకి నూతన ప్రస్థానం
అమరావతి: విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పిఆర్పీ) పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘కొత్త తరం.. కొత్త పార్టీ’ అనే నినాదంతో రాజకీయాల్లో తన కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు, నూతన ఆలోచనలే లక్ష్యంగా పార్టీ పేరును ‘పరివర్తన రాజనీతి పార్టీ’గా ఖరారు చేసినట్లు తెలిపారు. పిఆర్పీ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.








కామెంట్‌లు (0)