విజయవాడ : నగర ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటామని విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ .. ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) నాయకత్వంలో నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సహకారంతో పనిచేస్తానన్నారు. అందరం ఐక్యంగా ముందుకు సాగుతామన్నారు. నగర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానని తెలిపారు. పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్యానికి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశానని, 30 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతున్నామని వెల్లడించారు. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణను చూడాలనేది నగర ప్రజల బలమైన కోరికగా ఉండేదని, ఇప్పుడు అది నెరవేరిందని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతికి ముఖద్వారం విజయవాడ అని చెప్పారు. ఇది అత్యంత పురాతన నగరం అని అన్నారు. మేయర్ రాధాకృష్ణకు విజయవాడ కూటమి శ్రేణుల సహకారం ఉంటుందన్నారు. కొత్త కౌన్సిల్ ముందు ఎన్నో సవాళ్లున్నాయని తెలిపారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తో సమర్థ నాయకత్వం వచ్చిందని తెలిపారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు తీసుకొస్తామని చెప్పారు. అత్యధికంగా కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. పిపిపి మోడల్‌లో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్పొరేషన్ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటాం అని కేశినేని శివనాథ్ అన్నారు.
ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటాం : వంగవీటి రాధాకృష్ణ
27 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 03:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)