శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలింగ్ బూత్ మార్పుపై గ్రామస్తుల ఆగ్రహం

2 రోజుల క్రితం

పోలింగ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 12:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎన్నికలను బహిష్కరించిన ప్రజలు!

ప్రజాశక్తి - పశ్చిమ గోదావరి జిల్లా(భీమవరం): సుమారు 40 ఏళ్లుగా కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను మరో ప్రాంతానికి మార్చడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకపురంలో కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను కోమటితిప్పకు మార్చడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును గ్రామస్తులు నిలదీసి, తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలింగ్ బూత్‌ను యథాస్థానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాన్ని అకస్మాత్తుగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్తులు, అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ బూత్ మార్పును వ్యతిరేకిస్తూవినాయకపురం ప్రజలు ఎన్నికలను స్వచ్ఛందంగా బహిష్కరించారు. తమ సమస్యను అధికారులు పరిష్కరించే వరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్