ఇంటర్నెట్ : ఆ ఎఐ టెక్నాలజీతో సెకన్ల వ్యవధిలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. తాజాగా ఓ టెకీ తిరుమలలో వసతి గదిని ఒక ఎఐ మోడల్ ద్వారా బుక్ చేసే ప్రయత్నం చేశాడు. అంతా బాగానే జరిగింది కానీ.. చివరిలో పేమెంట్ దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్ బై పవన్ అనే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను ప్రతి నెలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. ముఖ్యంగా గంటలోపే దర్శన టికెట్లు ఖాళీ అవుతున్నాయి.. చాలామంది తిరుమల యాత్రికులు టికెట్లు దొరక్క నిరాశతో ఉంటున్నారు. అయితే ఓ టెకీ చాట్ జీపీటీతో తిరుమలలో రూమ్ బుకింగ్ చేసే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టెక్ బై పవన్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది.. అతడు చాట్‌జీపీటీ ద్వారా టీటీడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వసతి గతిని దాదాపు బుక్ చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
ఆ టెకీ ఈ ఏడాది డిసెంబర్ 21 కోసం తిరుమలలో వసతి బుక్ చేయాలని అత్యాధునిక ఏఐ ఏజెంట్ అయిన చాట్ జీపీటీ-6 ఆస్ట్రాకు ప్రాంప్ట్ ఇచ్చారు. ఆ చాట్‌బాట్ టీటీడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి యూజర్ లాగిన్ వివరాలు ఉపయోగించుకుని అక్కడ గదిని బుక్ చేసుకునేందుకు ఆప్షన్లను ఎంచుకుని, బుకింగ్ ప్రక్రియను కొనసాగించింది. కాకపోతే చివర్లో బ్యాంకు వివరాలు అందించకపోవడంతో పేమెంట్ ఆగిపోయింది.. గది బుక్ కాలేదు. ఈ వీడియోను టెకీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఏఐ మోడల్ ద్వారా దాదాపు గదిని బుక్ చేశాడు ఆ టెకీ. కానీ ఇక్కడ టీటీడీ నిబంధనను గుర్తు చేయాలి.. తిరుమలలో గదిని బుక్ చేసుకోవాలంటే కచ్చితంగా దర్శనం టికెట్ ఉండాలి. అప్పుడే టీటీడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి గదిని బుక్ చేయొచ్చు.








కామెంట్‌లు (0)