మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాక్సింగ్‌లో స్కూల్ గేమ్స్ స్టేట్ మీట్ కు ఎంపికైన వీరేంద్ర

12 గంటల క్రితం

veerendra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : స్థానిక ఎస్ కె వి టి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి కోసూరి వేమన వెంకటసత్య వీరేంద్ర బాక్సింగ్ లో స్కూల్ గేమ్స్ స్టేట్ మీట్ కు ఎంపికయ్యాడు. స్కూల్‌ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ మీట్ లో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో జరిగిన 48-50 వెయిట్ కేటగిరీ బాక్సింగ్ లో వీరేంద్ర ప్రథమ స్థానం సాధించినట్టు పి డి.సూర్య శంకర రావు తెలిపారు. త్వరలో పిఠాపురం లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో వీరేంద్ర పాల్గొంటారని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం అసెంబ్లీలో అర్బన్ ఎంఈఓ ఎం.వి.ఎం సుబ్రహ్మణ్యం, పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు, కోచ్ శంకర్,పి డి బి కల్పన, డ్రాయింగ్ ఉపాధ్యాయులు డాక్టర్ పుప్పాల బాపిరాజు తదితరులు వీరేంద్రని అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్