ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటారు. కర్మాగారానికి అవార్డులు తెచ్చిపెట్టారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ (ఐసిక్యూసిసి-2026) పోటీల్లో మూడు గోల్డ్ అవార్డులు సాధించారు. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన బ్లాస్ట్ ఫర్నేస్, ఎస్ఎంఎస్-1, యుటిలిటీస్ విభాగాలకు చెందిన బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ నెల 19న ఉక్కు హౌస్‌లోని హెచ్‌ఆర్‌డి కేంద్రం నుంచి ఆన్‌లైన్‌లో తమ ప్రాజెక్టులను ప్రదర్శించాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు అవార్డులు గెలుచుకున్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగ ఉద్యోగుల బృందం హెచ్‌టి మోటార్ వాక్యూమ్ కాంటాక్టర్‌లో మార్పులపై, ఎస్ఎంఎస్ విభాగ ఉద్యోగుల బృందం ఎల్‌డి కన్వర్టర్ ఐడి ఫ్యాన్ ఆయిల్ పైప్‌లైన్‌లో మార్పులపై, యుటిలిటీస్ విభాగ ఉద్యోగుల బృందం నైట్రోజన్ కంప్రెసర్ మోటార్‌ను సులభంగా సింక్రనైజ్ చేసే విధానంపై ప్రాజెక్టులను సమర్పించాయి. ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యం, సమిష్టి కృషి, కొత్త ఆలోచనలకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయి. మూడు బృందాల సభ్యులను స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అభినందించింది.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు మూడు అంతర్జాతీయ అవార్డులు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)