శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'బ్రహ్మంగారిమఠం'లో దొంగ ఓట్ల జోరు

1 రోజు క్రితం

కడప
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 09:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి గని సునీల్ కుమార్ తల్లి ఓటును దొంగ ఓటు వేసిన వైనం

- మీడియా మిత్రులపై కూడా తిరగబడుతున్న బయట వ్యక్తులు

- చెన్నూరు కాజీపేట ప్రాంతాల నుండి రౌడీలను తెప్పించిన అధికార పార్టీ నాయకులు

ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం : కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో జరుగుతున్నటువంటి జడ్పిటిసి ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా దొంగ ఓట్లు వేసుకుంటున్నారు. ఓటర్లు తమ ఓటు వేయకముందే ఓటు వేశారు అంటూ ఎన్నికల అధికారులు వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి గండి సునీల్ కుమార్ తల్లి ఓటు ఆమె వెయ్యక ముందే ఓటు వేశారంటూ ఆమెను వెనక్కి పంపించేశారుద. ఫోటోలు చిత్రీకరిస్తున్నటువంటి మీడియా మిత్రులపైన కూడా చెన్నూరు నుండి వచ్చినటువంటి కొత్త వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడుతూ బెదిరింపులు పాల్పడుతున్నారు. మీడియా మిత్రులు ఫోటోలు తీస్తున్న సమయంలో మొబైల్స్ కూడా లాక్కొని దారుణంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు సమాచారం తెలిపిన కూడా పట్టించుకోని పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. చెన్నూరు కాజీపేట ప్రాంతం నుండి ప్రతి బూతుకు పదిమంది నుండి 20 మందికి పైగా ఒక్కొక్క బూతు వద్ద పడికాపులు కాస్తూ మద్యం సేవించి అరాచకాలు సృష్టిస్తున్నారు. తన తల్లి ఓటు కూడా వేయనీయ లేదంటూ జడ్పిటిసి అభ్యర్థి గండి సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్