సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

20వ రోజుకు చేరిన విఆర్ఏల నిరసన

1 గంట క్రితం

alamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండల కేంద్రమైన ఆలమూరు తాహసిల్దార్ కార్యాలయం ఎదుట గల ధర్నా చౌక్ లో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం చేస్తున్న నిరవధిక సహాయ నిరాకరణ ఉద్యమం సోమవారం 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు తాతపూడి ఇస్సాక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పే స్కేల్ ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలని, మరణించిన విఆర్ఏ కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల సంఘ సెక్రటరీ కె.శివరామారావు, ఉపాధ్యక్షుడు భువనగిరి ఏసు, సలహాదారుడు నాగేశ్వరరావు, ట్రెజరర్ కుందేటి శ్రీను సభ్యులు యార్లగడ్డ జీవరత్నం, ఏడిది వెంకటాద్రి, బూరిగ మంగాలక్ష్మీ, చోడవరపు రామలక్ష్మి, కోట లక్ష్మీ, షేక్ బషీర్ బిబి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్