ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రియాంక కుటుంబానికి న్యాయం చేస్తాం : మంత్రి అనిత

1 గంట క్రితం

We will ensure justice for Priyanka's family: Minister Anita
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీతో ఆమె ఫోన్‌లో మాట్లాడి దర్యాప్తు పురోగతి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం మంత్రి అనిత.. బాధితురాలు ప్రియాంక తండ్రి వెంకటేశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయనకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించారని, నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి, చట్టప్రకారం దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని హోం మంత్రి పునరుద్ఘాటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్