ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గురు, శుక్ర వారాల్లో ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

14 నవంబర్, 2026

UN warning
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆగ్నేయా బంగాళాఖాతంలో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గురు,శుక్రవారాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్‌ ‌ప్రఖార్‌ ‌జైన్‌ ‌తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ఈ అల్పపీడన వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయానికి తీవ్రవాయుగుండంగా, సాయంత్రానికి దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు. బుధవారానికి తీవ్రతుపాన్‌గా మారే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్