ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉచిత ఆర్ టి సి ప్రయాణానికి ఇప్పటి వరకు రూ.3,400 కోట్లు ఖర్చు చేశాం

23 సెప్టెంబర్, 2026

ఉచిత ఆర్ టి సి ,ప్రయాణానికి ఇప్పటి వరకు రూ.3,400 కోట్లు ఖర్చు చేశాం  ---  ఆర్ టి సి,చైర్మన్ కొనకళ్ల నారాయణరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆర్ టి సి చైర్మన్ కొనకళ్ల నారాయణరావు

ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : ​ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎపిఎస్ఆర్ టిసి చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మహిళలకు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు రూ.3,400 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు. అందులో భాగంగా ఈ నెలాఖరు నాటికి 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని, దీంతో బస్సుల కొరతలో సగం వరకు తీరే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదనంగా మరో 300 బస్సుల కోసం టెండర్లు పిలిచామని, వీటితో కలిపి కొత్త బస్సుల సంఖ్య 1,050కు చేరుతుందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ 500 ఎసి, సిఎన్ జి బస్సులను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి, టెండర్ల ప్రక్రియ చేపట్టిందన్నారు. వీటితో కలిపి రానున్న కాలంలో మొత్తం 1,550 కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్