ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు - మంత్రి కందుల దుర్గేష్

23 సెప్టెంబర్, 2026

27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
- మంత్రి కందుల దుర్గేష్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఈ నెల 27న పర్యాటక, సాంస్కృతిక కేంద్రమైన రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో పర్యాటకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, టూరిజం ఎమ్‌డి పట్టాన్ శెట్టి రవి సుభాష్‌తో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటకశాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లు, టెంట్ సిటీలు, హోమ్ స్టేలు, యాత్రికులకు మెరుగైన వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రానికి ఇన్-బౌండ్ టూరిస్టుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్