శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దసరా, 'విజయవాడ ఉత్సవ్‌'లకు అస్సాం సిఎంకు ఆహ్వానం

24 సెప్టెంబర్, 2026

అస్సాం సీఎం ను విజయవాడ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్న మంత్రి సత్య కుమార్, విజయవాడ ఎంపీ చిన్ని image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆహ్వానించిన మంత్రి సత్య కుమార్, విజయవాడ ఎంపీ చిన్ని

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలకు, 'విజయవాడ ఉత్సవ్‌'కు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ప్రత్యేక ఆహ్వానం అందించారు. అస్సాం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆహ్వాన ప్రతికలను అందజేశారు. విజయవాడ నగరానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను, నగర సాంస్కృతిక ప్రత్యేకతను దేశవ్యాప్తంగా పరిచయం చేసేందుకు విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటు ‘విజయవాడ ఉత్సవ్‌’ను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని, దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని అస్సాం సీఎంను కోరారు. అస్సాం ముఖ్యమంత్రితో పాటు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అశోక్ సింఘాల్, సీఎస్ డాక్టర్ రవి కోటలను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ ద్వారా నగరాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్