-టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ గ్రూప్ 'ఈటీ ఎడ్జ్' అందజేత
ప్రజాశక్తి - తెనాలి (గుంటూరు జిల్లా) దేశ విదేశాలలో ఆహార ప్రియుల మన్ననలు పొందిన వ్యాపార దిగ్గజం 'తెనాలి డబల్ హార్స్' మినప గుళ్లు మరో మైలురాయిని చేరుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ 'ఈటీ ఎడ్జ్' అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్' అవార్డును దక్కించుకుంది. ఈ అత్యున్నత పురస్కారాన్ని తెనాలి డబల్ హార్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మునగాల మోహన శ్యామ్ ప్రసాద్, డైరెక్టర్లు మునగాల రోజా హర్షవర్ధన్, మునగాల లలిత గురువారం ముంబయిలో అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెనాలి డబల్ హార్స్ సంస్థ అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, దేశ విదేశాలలో ఆహార ప్రియుల నుంచి గణనీయమైన ఆదరణను చూరగొందని, నిరంతరం ఆహార ఉత్పత్తులలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐటిసి, బ్రిటానియా, రిలయన్స్, ఎవరెస్ట్ వంటి దేశపు అత్యున్నత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ల సరసన 'తెనాలి డబల్ హార్స్' నిలిచిందన్నారు. జనరల్ మేనేజర్ పి ఎన్ వి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. భారతీయ ఆహార, వ్యవసాయ రంగంలో ఎంతో నమ్మకమైన ప్రముఖ సంస్థగా తెనాలి డబల్ హార్స్ ఉందన్నారు. వినియోగదారులు తమపై ఉంచిన నమ్మకానికి, నిరంతర ప్రోత్సాహానికి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి డబల్ హార్స్ యాజమాన్యాన్ని పలు వ్యాపార సంస్థలు అభినందించాయి.








కామెంట్‌లు (0)