ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ భవనానికి మినహాయింపులా?

25 సెప్టెంబర్, 2026

ఆ భవనానికి మినహాయింపులా?
- వెంకటపాలెం ప్రకృతి ఆశ్రమం వద్ద విచిత్రం
- కరకట్ట నిర్మాణంలో మార్పుపై రైతుల ఆగ్రహం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వెంకటపాలెం ప్రకృతి ఆశ్రమం వద్ద విచిత్రం

- కరకట్ట నిర్మాణంలో మార్పుపై రైతుల ఆగ్రహం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలో ల్యాండ్‌ ‌పూలింగు స్కీమ్‌ ‌కింద రోడ్లను నిర్మించేందుకు సెటిల్‌‌మెంట్‌ ‌పాలసీ ఏర్పాటుచేసి ఇళ్లను తొలగిస్తున్న అధికారులు.. ఓ భవనం విషయంలో మాత్రం రోడ్డునే మార్చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకో న్యాయం.. వారికో న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్‌ ‌పూలింగు స్కీము కింద ప్లాను ప్రకారం రోడ్లు వేసేందుకు గ్రామాల్లో నెగోషియబుల్ సెటిల్‌‌మెంట్‌ ‌పాలసీ పెట్టి వారి నుంచి భూములు తీసుకుంటున్న సిఆర్‌‌డిఎ.. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాజధాని నిర్మాణంలో భాగంగా కరకట్ట రోడ్డును సుమారు ఆరున్నర కిలోమీటర్ల దూరం, 100 అడుగుల వెడల్పున విస్తరిస్తున్నారు. ఇది ఉండవల్లిలోని కొండవీటివాగు రెగ్యులేటర్‌ ‌నుండి తాళ్లాయపాలెం సమీపం వరకూ ఉంటుంది. అన్నిచోట్లా రెండువైపులా విస్తరించిన అధికారులు.. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్దకు వచ్చేప్పటికి రోడ్డును వంకరతిప్పి ఒకే వైపునకు విస్తరిస్తున్నారు. దీనిపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆశ్రమాన్ని కాపాడేందుకు రోడ్డును కరకట్ట బయట వైపునకు వంకర తిప్పారని రైతులు చెబుతున్నారు. నిజంగా రోడ్లు వెళ్లాల్సిన మార్గంలో ఇళ్లు, ఇతర నిర్మాణాలుంటే నెగోషియబుల్‌ ‌సెటిల్‌‌మెంట్‌ పాలసీ ప్రకారం తీసుకుంటున్నారని, అది ఆశ్రమానికి వర్తించదా? అని ప్రశ్నిస్తున్నారు. మందడంలో రోడ్డు ఎలైన్‌మెంట్ మార్చడంతో ఇల్లు కోల్పోయిన ఆవేదనతో రామారావు అనే రైతు మరణించిన సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించాల్సిందేనని, రోడ్డు వంపు ఉండకూడదని చెప్పే అధికారులు.. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయి. ఇటీవల పలువురు రైతులు దీనిపై సందేహాలు లెవనెత్తగానే మంతెన సత్యనారాయణరాజు సోషల్‌ ‌మీడియాలో మాట్లాడుతూ.. ప్రకృతి ఆశ్రమం గోకరాజు గంగరాజుదని, అతని పర్యవేక్షణలోనే నడుస్తోందని ప్రకటించారు. దీనిద్వారా విమర్శకుల నోరు మూయించేందుకు ప్రయత్నించారని, తమ భూములు కోల్పోయిన తరువాత ఎవరైనా భయపడేది లేదని రైతులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అమరావతి విషయంలో హాట్‌ ‌టాపిక్‌‌గా మారింది. ఏదైనా ప్లాను ప్రకారం జరుగుతున్నప్పుడు ఇటువంటి మార్పులు, చేర్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్