ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుర్తింపు కార్డులు పంపిణీ

26 సెప్టెంబర్, 2026

గుర్తింపు కార్డులు పంపిణీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 08:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- తాడేపల్లి : స్థానిక వైఎస్‌ఆర్‌‌సిపి నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను శనివారం పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించాలని ఈ ఐడి కార్డులు ఇస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల ఎలీషా, జీలగ గాలయ్య, ప్రధాన కార్యదర్శులు సర్దార్, చిట్టిమళ్ళ స్నేహసంధ్య, పేరం శ్రీను, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు వివిధ విభాగాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్