ప్రజాశక్తి - కోటనందూరు : అల్లిపూడి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి శనివారం 50,000 వేలు విలువైన ఇన్వర్టర్, 20,000 విలువగల కుర్చీలను దాతలు అందించారు. చిన్నగొలుగొండుపేట గ్రామానికి చెందిన అంకం రెడ్డి నూకరాజు కుమారుడు వెంకట సత్య ఈశ్వర రావు, అంబికా దంపతులు మానవతా దృక్పథంతో ఈ సాయం అందించారు. కరెంటు పోయినపుడు విద్యార్థులు పడుతున్న అవస్థలను చూసి, వారి చదువుకు ఆటంకం కలగకూడదని ఇన్వెర్టర్ వేయించామని అంబికా అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రభుత్వ సౌకర్యాలకు తోడు మానవతావాదులు కూడా సహకరిస్తే విద్యార్థులు విద్యాపరంగా ముందుకు సాగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ జి .రాజేశ్వరి, జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి ,జి సి డి వో కె.వెంకటలక్ష్మ, మండల విద్యాశాఖ అధికారులు ఏ. శ్రీనివాస్ రావు,ఎం .రామశేకర్ దాతల కృతజ్ఞతలు తెలిపారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి దాతల సహకారం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)