ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌సక్రమమే

30 సెప్టెంబర్, 2026

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 11:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- డీలిమిటేషన్ 2026 ప్రకారం దక్షిణాదికి నష్టం

- రాజ్‌‌దీప్‌ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :'

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌ఎస్‌ఐఆర్‌‌పై ఇచ్చిన వివరణను టిడిపి పరిశీలించిన తరువాత సక్రమంగానే ఉందని తాము భావిస్తున్నామని ఆ పార్టీ జాతీయ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌తెలిపారు. కేరళంలోని కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్-2026లో భాగంగా సీనియర్‌ ‌జర్నలిస్ట్‌ ‌రాజ్‌‌దీప్‌ ‌సర్దేశాయ్‌ ‌పలు అంశాలపై లోకేష్‌‌ను ఇంటర్వ్యూ చేశారు. వ్యవస్థను ప్రశ్నించే వారికి కొంత బాధ్యత కూడా ఉండాలన్నది తన అభిప్రాయం అన్న లోకేష్‌.. ప్రస్తుతం చాలా రాజకీయ పార్టీలు ఎస్‌ఐఆర్‌ గురించి ప్రశ్నిస్తున్నాయని తెలిపారు. తమ పార్టీ పరంగా కూడా ఎస్‌ఐఆర్‌‌పై వివిధ అంశాలను ఎప్పటికప్పుడు వివరణలు కోరామన్నారు. తాము కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎదుర్కొన్నామని చెప్పారు. వ్యవస్థ పూర్తిగా పరిపూర్ణమా అంటే కచ్చితంగా కాదని, ఏ వ్యవస్థలోనైనా మెరుగుపరచాల్సిన అంశాలు ఉంటాయని, ఆ ప్రయత్నమే జరుగుతోందని చెప్పారు. ఇకముందు కూడా ఈ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి తమ వంతు సలహాలు, సూచనలు ఇస్తామని తెలిపారు. డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక వనరుల విషయంలో భవిష్యత్తు సవాళ్లను ఆలోచించారా? లేక పెట్టుబడులు రావాలనే తొందరలో ముందుకు వెళ్తున్నారా? అని రాజ్‌‌దీప్‌ ‌ప్రశ్నించగా.. కచ్చితంగా తాము తొందరలోనే ఉన్నామని లోకేష్‌ అన్నారు. తమ వద్ద ఐదేళ్ల సమయం మాత్రమే ఉందన్నారు. యువత కూడా తొందరలో ఉందని, వారు త్వరగా ఫలితాలు చూడాలనుకుంటున్నారని తెలిపారు. క్లస్టర్ ఆధారిత విధానంతో ముందుకు వెళ్తున్నామని, నీటి, విద్యుత్ అవసరాలను ముందుగానే ప్రణాళిక చేస్తున్నామన్నారు. గూగుల్‌‌తో సహా చాలా డేటా సెంటర్లు ఎయిర్-కూల్డ్ డేటా సెంటర్లుగా ఉంటాయని, అవి వినియోగించే నీటి పరిమాణం ఐటి సెంటర్ ఉపయోగించే నీటితో సమానంగా ఉంటుందని చెప్పారు. అందువల్ల తాము దీనికి ప్రణాళిక చేస్తున్నామన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనపై లోకేష్‌ ‌మాట్లాడుతూ.. ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని చెప్పారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందనే అంశంపై తాము ఆందోళన వ్యక్తం చేశామన్నారు. డిఎస్‌‌సిపై రాజకీయ నిరుద్యోగులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపిస్తున్న స్పోర్ట్స్ సర్టిఫికెట్లన్నీ వైసిపి ప్రభుత్వంలో జారీ చేసినవేనని అన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్