ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్‌ రాజేష్‌‌కు అవార్డు

02 అక్టోబర్, 2026

ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్‌ రాజేష్‌‌కు అవార్డు
- జాతీయ ఫొటోగ్రఫీ పోటీలో ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 07:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జాతీయ ఫొటోగ్రఫీ పోటీలో ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

ప్రజాశక్తి - ఎఎన్‌‌యు (గుంటూరు జిల్లా) :

జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీలో విశాఖపట్నానికి చెందిన ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్ కుంచం రాజేష్ ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను అందుకున్నారు. ఎపి స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పిఎఐ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ -2026లో రాజేష్‌ ఛాయాచిత్రం అవార్డుకు ఎంపికయ్యారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును వర్సిటీ రెక్టార్ కె శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి సింహాచలం ప్రదానం చేశారు. ​‘మై ఇండియా : 80 ఇయర్స్‌ ఆఫ్‌ ‌డెమోక్రసీ అండ్‌ ‌ఫ్రీడం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన పోటీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనను అద్భుతంగా చిత్రీకరించిన రాజేష్ ఫొటో ప్రత్యేక గుర్తింపు పొందింది. జాతీయ పతాకంలోని మూడు రంగులను ప్రతిబింబించేలా చిన్నారులు చేసిన ప్రదర్శన, ముందుభాగంలో జాతీయ పతాకం, వెనుకభాగంలో ‘ఇండిపెండెన్స్‌ ‌డే విశాఖపట్నం’ సందేశంతో ఉన్న దృశ్యాన్ని రాజేష్‌ ‌తన కెమెరాలో బంధించారు. అవార్డు పొందిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎఐ కాంటెస్ట్ చైర్మన్ టి శ్రీనివాసరెడ్డి ఎఫ్‌ఆర్‌‌పిఎస్‌, రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ మల్లికార్జునరావు, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్