ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైభవంగా శ్రీవారి గరుడసేవ....

16 అక్టోబర్, 2026

daa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించారు. నాలుగు మాఢవీధుల్లో శ్రీవారిని ఊరేగించారు. గజరాజుల గంభీర నడక, మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషల నడుమ సాగిన గరుడసేవ వైభవంగా జరిగింది. అడుగడుగునా యాత్రికులు కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌, చిన్నజీయర్‌, టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఇఒ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జెఇఒలు డాక్టర్ ఎ శరత్, ప్రభల గోపీనాథ్, సివి ఎస్ఒ మురళీకృష్ణ, జిల్లా ఎస్ పి ఎల్ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్