- ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు
ప్రజాశక్తి - మంగళగిరి ( గుంటూరు జిల్లా)
మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించాయనే నెపంతో బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో కూటమి పార్టీలు 40 శాతం రిజర్వేషన్లు ఇస్తామనడంపై ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16వ ఆర్థిక సంఘం నిధులు మురిగి పోకుండా, స్థానిక సంస్థల గడువు ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. రాజ్యాంగానికి లోబడి న్యాయస్థానాలను గౌరవిస్తూ బిసిల మనోభావాలకనుగుణంగా పార్టీ పరంగా 40 శాతం బిసిలకు రిజర్వేషన్లు ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలూ స్థానిక సంస్థలలో బిసిలకు 40 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తొలిగా అధికారులు నగర, పురపాలికల రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ నివేదిక మేరకు రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో బిసిలకు 5,106 మున్సిపాలిటీలలో 36 మాత్రమే కేటాయించారని తెలిపారు. సిఎం చంద్రబాబు ప్రకటించిన 40 శాతం కేటాయించాలంటే, 7 కార్పొరేషన్లు, 42 మున్సిపాలిటీలను బిసిలకు కేటాయించాల్సి ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమ యువజన రాష్ట్ర అధ్యక్షులు పారేపల్లి మహేష్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు బాదుగున్నల శ్రీనివాస్, కోలా అశోక్, శివరాం బాబాజీ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)