శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎస్‌ నుంచి ఒపిఎస్‌కు...

09 నవంబర్, 2026

Tribal employees must be reinstated immediately
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 11:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

-2004 సెప్టెంబర్‌ 1కి ముందు నోటిఫికేషన్‌‌తో చేరిన ఉద్యోగులకు గడువు పొడిగింపు

ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగులు పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)లోకి మారేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు ఉద్యోగ నియామక ప్రకటన లేదా నోటిఫికేషన్‌ విడుదలై ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులై ప్రస్తుతం సిపిఎస్‌ పరిధిలో ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. ఈ మేరకు మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ర్హులైన ఉద్యోగులు, ఉద్యోగ విరమణ చేసినవారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షన్‌ లబ్ధిదారులు తమ ఆప్షన్‌ను డిసెంబరు 31వ తేదీలోగా వినియోగించుకోవాలని దీనిలో తెలిపింది. దరఖాస్తులన్నింటినీ నిధి పోర్టల్‌ ద్వారానే సమర్పించాలని ఇందుకోసం నిధి పేరోల్‌ అప్లికేషన్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు తమ ప్రాన్‌ ఖాతా నుంచి ఉద్యోగి వాటాను జిపిఎఫ్‌ ఖాతాకు బదిలీ చేయాలని డిడిఓకు దరఖాస్తు చేస్తే, అధికారుల పరిశీలన అనంతరం గతంలో సిపిఎస్‌ నుంచి పాక్షికంగా ఉపసంహరించుకున్న మొత్తాన్ని మినహాయించి, మిగిలిన మొత్తానికి వడ్డీ సహా లెక్కించి జీపీఎఫ్‌ ఖాతాను కు జమచేస్తారని పేర్కొంది. ఇప్పటికే సిపిఎస్‌ నిబంధనల ప్రకారం పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన ఉద్యోగులు ఓపీఎస్‌కు మారాలంటే ప్రభుత్వ వాటా, దానిపై వచ్చిన పెట్టుబడి రాబడిని తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు డిటిఏ, పిఎఓ కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్