శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తొలగించిన కాలును భద్రపరచాలి

10 నవంబర్, 2026

andhra-pradesh-high-court.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విద్యార్థినిపై దాడి కేసులో హైకోర్టు

​ప్రజాశక్తి-అమరావతి :

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్‌‌పి ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో రాక్షసంగా దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడి శరీరం నుంచి తొలగించిన కాలును భద్రపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులతోపాటు అనంతపురం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన అనుబంధ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ పిల్‌లో విద్యాశాఖ అధికారులను ప్రతివాదులుగా చేర్చాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఇంప్లీడ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రాప్తాడు ఘటనపై సిబిఐతో సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపికృష్ణ పిల్ దాఖలు చేశారు. నిందితుడి శరీరం నుంచి తొలగించిన కాలును భద్రపరచాలని, విద్యాశాఖ అధికారులను కేసులో ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ మరో రెండు అనుబంధ పిటిషన్లు వేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్