శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తగ్గించిన ధరలకే కేన్సర్‌ మందులు

10 నవంబర్, 2026

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 11:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరలకే కేన్సర్‌ మందుల విక్రయాలు ఉండాలని అధికారులకు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో సమీక్షించి ఆస్పత్రులు, మందుల దుకాణాలకు మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఔషధ తనిఖీ అధికారి ఏడు రోజుల్లో కేన్సర్‌ ఆస్పత్రులను తనిఖీ చేయాలని, మందులు తగ్గించిన ధరలకు విక్రయిస్తున్నారా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలించాలని, అందుబాటులో లేవని ఫిర్యాదు అందితే 24 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేసినా, మందులు అందుబాటులో లేకపోయినా ఔషధ నియంత్రణశాఖ వాట్సాప్‌ 8632330909, ఇ-మెయిల్‌ dca-grams@ap.gov.in ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్