శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిలకడగా రాప్తాడు ఘటన నిందితుడి ఆరోగ్యం...

14 నవంబర్, 2026

raptadu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలకు చికిత్స : సూపరింటెండెంట్

ప్రజాశక్తి - కర్నూలు క్రైమ్ : అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కర్నూలు సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ‌కె.వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతపురంలో చికిత్స పొందుతున్న హేమంత్‌‌ను మెరుగైన వైద్యం నిమిత్తం శుక్రవారం అర్ధరాత్రి కర్నూలు జిజిహెచ్‌‌కు తరలించారు. సిఎంఒలు, డ్యూటీ సర్జన్, అసిస్టెంట్ సర్జన్, ఆర్థోపెడిక్, కార్డియో థొరాసిక్, కార్డియాలజీ వైద్య బృందంతో పాటు సూపరింటెండెంట్‌ ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఊపిరితిత్తుల్లోని కొన్ని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించి, వాటిని కరిగించేందుకు చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం సూపరింటెండెంట్ రోగి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రికి వచ్చినప్పుడు కొంత ఆయాసం ఉన్నప్పటికీ, ప్రస్తుతం అది తగ్గిందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. నిందితుడికి 24 గంటల పాటు నిరంతర వైద్య పర్యవేక్షణ అందించాలని వైద్య బృందాన్ని ఆదేశించినట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్