ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కూటమి’లో అసంతృప్తి ‌సెగలు

20 నవంబర్, 2026

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

-కడప జెడ్‌‌పి ఛైర్మన్ పీఠం కోసం టిడిపి, బిజెపిలో విభేదాలు బహిర్గతం

-ప్రమాణస్వీకారానికి బిజెపి జెడ్‌‌పిటిసి సభ్యులు గైర్హాజరు

-రాజీనామా బాటలో ఆదినారాయణరెడ్డి!

-విజయవాడలో బిజెపి రాష్ట్ర నాయకత్వం బుజ్జగింపులు

ప్రజాశక్తి- కడప ప్రతినిధి, : కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం విషయంలో కూటమిలోని టిడిపి, బిజెపి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. బిజెపికి భంగపాటు ఎదురైంది. దీంతో, ప్రమాణస్వీకారానికి ఆ పార్టీ జెడ్‌‌పిటిసి సభ్యులు గైర్హాజరయ్యారు. టిడిపి తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ పార్టీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారంతో బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం కోసం కూటమి నుంచి టిడిపి తరఫున వీరపునాయునిపల్లి జెడ్‌‌పిటిసి సభ్యుడు పుత్తా నరసింహారెడ్డి, బిజెపి నుంచి ఆ పార్టీ జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు చదిపిరాళ్ల రాజేష్ రెడ్డి పోటీలు పడ్డారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు టిడిపికే దక్కాయి. 39 జెడ్‌‌పిటిసి సభ్యుల్లో 32 టిడిపి జెడ్‌‌పిటిసి సభ్యులు, ఇద్దరు జనసేన జెడ్‌‌పిటిసి సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపికి చెందిన జమ్మలమడుగు, ముద్దనూరు, యర్రగుంట్ల, టిడిపికి చెందిన మైలవరం జెడ్‌‌పిటిసి సభ్యులు గైర్హాజరయ్యారు. బిజెపికి జెడ్‌‌పి పీఠం దక్కకపోవడం పట్ల ఆదినారాయణరెడ్డి‌ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా ఆలోచనలో ఉన్నారనేది ప్రచారంతో బిజెపి రాష్ట్ర నాయకత్వం విజయవాడలోని ఓ హోటల్‌‌లో ఆయనతో సంప్రదింపులు చేస్తూ బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. రాయలసీమలో ఉన్న ఒక్క సీనియర్ ఎమ్మెల్యేను పోగొట్టుకోలేక తంటాలు పడుతోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్