ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమానత్వ సమాజమే లక్ష్యం

14 గంటల క్రితం

jsp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- చంద్రబాబు, పవన్

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్య, సమానత్వంతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని మహాత్మా జ్యోతిరావు ఫూలే చాటి చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ఫూలే వర్థంతి సందర్భంగా శనివారం ఎక్స్‌ వేదికగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. అణగారిన తరగతుల విద్యాభివృద్ధి, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం ఫూలే తన జీవితాంతం పోరాడారని చంద్రబాబు కొనియాడారు. బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి, విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నిరూపించారని పేర్కొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. భారత సామాజిక విప్లవానికి ఫూలే పునాదులు వేశారని గుర్తుచేశారు. ఫూలే ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య, గౌరవం, సమాన అవకాశాలు లభించినప్పుడే సమాజంలో అసలైన మార్పు వస్తుందన్నారు. ఫూలే ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్