బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

3rd Day - డీఎస్సీ పై శాసనమండలిలో వైసిపి వాయిదా తీర్మానం

1 గంట క్రితం

ap assembly
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 12:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. డీఎస్సీ–2025 నిర్వహణ, నియామకాల అంశం మరోసారి చర్చకు వచ్చింది. వరుసగా మూడో రోజు డీఎస్సీ అంశంపై వైసిపి ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. డీఎస్సీ–2025 నిర్వహణతో పాటు ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియకు సంబంధించిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 పై సభలో సమగ్రంగా చర్చించాలని వైసిపి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు కల్పలత, ఎం.వి. రామచంద్రారెడ్డి, పి. చంద్రశేఖర్ రెడ్డిలు వాయిదా తీర్మానం అందజేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపడుతున్న డీఎస్సీ ప్రక్రియపై నిరుద్యోగులు, అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయని వైసిపి సభ్యులు తెలిపారు. ముఖ్యంగా డీఎస్సీ–2025 నిర్వహణ, పోస్టుల సంఖ్య, నియామక విధానం, ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47కు సంబంధించిన అంశాలను సభలో చర్చించడం ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని అన్నారు. ఇప్పటికే డీఎస్సీకి సిద్ధమవుతున్న వేలాదిమంది అభ్యర్థులు పరీక్ష నిర్వహణ, నియామకాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ప్రభుత్వం పూర్తి వివరాలను సభ ముందుంచాలని వైసిపి ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీపై వైసిపి సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టి వైసిపి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మెడలో నల్ల కండవాలతో నిరసన తెలిపారు. ఉద్రిక్తత నడుమ శాసన మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు






ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్