mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లండన్ వరల్డ్ బుక్ లో 'యోగాంధ్ర'

3 గంటల క్రితం

yoga record
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 01:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2026’ సామూహిక ఆరోగ్య, యోగా ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వమైన రీతిలో ప్రజా సమీకరణ, రికార్డు స్థాయి భాగస్వామ్యంతో విజయవంతమైన ఈ మెగా కార్యక్రమం లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకుంది. ఇందిరా గాంధీ మున్సిపల్‌ ‌స్టేడియంలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఈ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ ఉల్లాజి ఎలియాజర్.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును మంత్రి సత్యకుమార్‌కు సిఎం అందజేశారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల స్థాయి నుండి మొదలుకొని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు వివిధ అంచెలుగా పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి తుది పోటీల్లో 372 మంది ప్రతిభావంతులు పోటీ పడగా, 66 మంది విజేతలుగా నిలిచి రాష్ట్ర యోగా పర్యావరణ వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారని ఆయుష్ డైరెక్టర్ గోపాలకృష్ణ వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్