ప్రజాశక్తి - తిరుపతి సిటీ : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 1న జరగనున్న పోలింగ్‌లో రిగ్గింగ్‌ను అరికట్టాలని, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ వైసిపి తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ మేయర్ అభ్యర్థి వై.వాసు యాదవ్, పోటీలో ఉన్న 63 మంది కార్పొరేటర్ అభ్యర్థులు గురువారం శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా అధ్యక్షులు భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ల సమయంలో తమ పార్టీ అభ్యర్థులపై దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చించివేసి దాఖలు చేయకుండా అడ్డుకోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కార్పొరేటర్ అభ్యర్థులు, వారి పోలింగ్ ఏజెంట్లకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని, పోలింగ్ రోజున రిగ్గింగ్, దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై అభ్యర్థుల వ్యక్తిగత సంతకాలతో కూడిన ఫిర్యాదులు, వీడియో సందేశాలను ఇప్పటికే ఎన్నికల అధికారులకు పంపినట్లు తెలిపారు. ఇటువంటివి జరగకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని, నవంబర్ 1న స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, ఎస్‌పి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
Print Editionప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. వైసిపి అభ్యర్థులు శాంతియుత నిరసన
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 08:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)