ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కుల గణనన డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్టు వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి బృందంతో గురువారం సమావేశమైన ఆయన వారితో ఈ అంశంపై చర్చించారు. అనంతరం కుల గణనకు సంబంధించి కమిటీ చేసిన డిమాండ్లను జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సామాజిక న్యాయం సాధించాలంటే సమగ్ర, సుస్థిర, సమాన అభివృద్ధికి వీలుగా వాస్తవ గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. కుల గణనకు సంబంధించి సమన్వయ కమిటీ చేసిన డిమాండ్లు సమంజసమైనవన్నారు. జనాభా లెక్కల్లో ఒబిసి, బిసి కోసం సంబంధిత రాష్ట్రాల్లో ప్రత్యేక కులం నమోదు కాలమ్‌ను తప్పనిసరిగా చేర్చాలని, గణన ప్రక్రియలో ఏ కులం కూడా మిగిలిపోకుండా సమగ్ర కులాల ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచాలని, ప్రతి కుటుంబ ఆర్థిక స్థితిని తెలియజేసే వివరాలను నమోదు చేయాలని కమిటీ డిమాండ్ చేసిందన్నారు. వైసిపి ఎప్పుడూ ఈ అంశానికి గట్టిగా మద్దతుగా నిలిచిందని, సమగ్ర కుల గణన చేపట్టాలన్న డిమాండ్‌ను ముందుండి సమర్థించిందని జగన్ వెల్లడించారు.
Print Editionకులగణన డిమాండ్‌కు వైసిపి మద్దతు : వై.ఎస్ .జగన్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 10:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)