సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇపిడిసిఎల్‌ పరిధిలో రూ.3.96 కోట్లు నష్టం

2 రోజుల క్రితం

viajy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో భారీ వర్షాల ‌ప్రభావానికి ఇపిడిసిఎల్‌ ‌పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.3.96 కోట్ల మేర విద్యుత్‌ ‌మౌలిక వసతులకు నష్టం వాటిల్లిందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ ‌తెలిపారు. ఈ నష్టం 36 మండలాలు, 2,244 గ్రామాల పరిధిలో నమోదైందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 139 సబ్‌‌స్టేషన్లు, 33 కెవి ఫీడర్లు 121 , 11 కెవి ఫీడర్లు 654, 33/11 కెవి విద్యుత్‌ ‌స్తంభాలు 803, 758 ఎల్‌‌టి స్తంభాలు, 306 డిస్ర్టిబ్యూషన్‌ ‌ట్రాన్స్‌‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. అవసరమైన సామగ్రి, సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలను వెంటనే చేపట్టామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని కళింగపట్నం సమీపంలో ఈ నెల 23, 24 తేదీల్లో అల్పపీడనం తీరం దాటిన తరువాత తీవ్ర అంతరాయాలను వేగంగా అధిగమించినట్లు తెలిపారు. వాతావరణ వ్యవస్థ తీవ్రతను ముందుగానే అంచనా వేసి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల అత్యవసర నియంత్రణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. విపత్తు నిర్వహణకు ముందస్తు సన్నద్ధతతో పాటు ఇంజినీరింగ్‌ ‌బృందాలు వేగంగా చేపట్టిన చర్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్‌‌ట్రా హై టెన్షన్‌ ‌నెట్‌‌వర్క్‌‌కు భారీ నష్టం వాటిల్లకుండా నివారించగలిగామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్