- భారత హాకీజట్టు శుభారంభం
- వేల్స్‌పై 3-1గోల్స్‌తో విజయం
- నేడు చైనాతో మహిళల పోరు
బ్రూసెల్స్(బెల్జియం): అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన పూల్-డి తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 3-1గోల్స్ తేడాతో వేల్స్‌ను చిత్తుచేసింది. తొలి క్వార్టర్‌లోనే భారతజట్టు రెండు గోల్స్ కొట్టి 2-0 ఆధిక్యతలో నిలువగా.. మరో గోల్ మూడో క్వార్టర్‌లో వచ్చింది. తొలి క్వార్టర్ 8వ నిమిషంలో సుమిత్ కొట్టిన గోల్‌తో భారత్ 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత 11వ, 43వ నిమిషాల్లో హర్మన్‌ప్రీత్ రెండు గోల్స్ కొట్టాడు. దీంతో భారత్ 3-0 ఆధిక్యతలో నిలిచింది. ఇక మ్యాచ్ మరో 6 నిమిషాల్లో ముగుస్తుందనగా వేల్స్ తరఫున వెల్స్ సామ్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 3-1కి తగ్గినా.. భారతజట్టు అప్పటికే విజయాన్ని ఖాయం చేసుకుంది. 17న జరిగే పూల్ లీగ్ రెండో మ్యాచ్‌లో భారతజట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. పూల్-బి మరో మ్యాచ్‌లో జర్మనీ జట్టు 5-1తో మలేషియాను ఓడించింది.
భారత మహిళల జట్టుకు కఠిన పరీక్ష
ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళలజట్టు కీలక పోరును ఎదుర్కోనుంది. పూల్-డిలో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో సలీమా తేతే సారథ్యంలోని భారత మహిళలజట్టు పటిష్ట చైనాతో తలపడనుంది. ఇక శుక్రవారం జరిగిన మహిళల పూల్ లీగ్ మ్యాచ్ గ్రూప్-బిలో జర్మనీ మహిళల జట్టు 3-0తో స్కాట్లాండ్‌ను చిత్తుచేయగా.. పూల్-ఎలో ఆస్ట్రేలియా జట్టు 2-0తో జపాన్‌ను ఓడించాయి.








కామెంట్‌లు (0)