శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పడిక్కల్‌ ‌అజేయ శతకం

1 గంట క్రితం

rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 11:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- భారీస్కోర్‌ ‌దిశగా టీమిండియా శ్రీలంకతో తొలి టెస్ట్‌

​గాలే: శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో దేవదత్‌ ‌పడిక్కల్‌ ‌అజేయ శతకానికి తోడు కెఎల్‌ ‌రాహుల్‌ అర్ధసెంచరీతో రాణించారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారతజట్టు 2వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. టాస్‌ ‌గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కి 47 పరుగులు జోడించిన తర్వాత కెఎల్ రాహుల్‌తో సమన్వయ లోపం కారణంగా యశస్వి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ స్ట్రెయిట్ షాట్ ఆడి, సింగిల్ కోసం నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌కి వచ్చాడు. అయితే బాల్‌ను చూస్తూ పరుగెత్తిన జైస్వాల్‌కి బౌలర్‌ అడ్డు రావడంతో కింద పడ్డాడు. లేచి గమనించేలోగా కెఎల్ రాహుల్ నాన్ స్ట్రైయికింగ్‌లో బ్యాటు పెట్టడంతో జైస్వాల్ అవుటయ్యాడు. 37 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసి జైస్వాల్ ఔటయ్యాడు. ఆ తర్వాత కెఎల్ రాహుల్ 162 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 77 పరుగులు చేసి, టీ బ్రేక్‌ సమయానికి ముందు క్రాంప్స్‌తో తీవ్రంగా ఇబ్బందిపడిన కెఎల్ రాహుల్, మూడో సెషన్‌లో బ్యాటింగ్‌కి రాలేదు. కెఎల్ రాహుల్ మెట్లు ఎక్కేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ప్రాక్టీస్‌ ‌మ్యాచ్‌‌లో మెరిసిన దేవ్‌దత్ క్రీజ్‌‌లోకి రావడమే తరువాయి లంక బౌలర్లపై చెలరేగాడు. 134 బంతుల్లో పడిక్కల్‌ ‌సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌‌లో రాణించి తొలిరోజు ఆట ముగిసేసరికి 131 పరుగులతో క్రీజ్‌‌లో నిలిచాడు. మరోవైపు కేఎల్ రాహుల్‌(77 రిటైర్డ్ హర్ట్) ‌క్రీజ్‌‌ను విడిచినా.. వీరిద్దరూ రెండో వికెట్‌‌కు 189పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. టీ విరామం తర్వాత మ్యాచ్‌‌కు కొద్దిసేపు వర్షం అంతరాయం కల్గించింది. పడిక్కల్‌, రిషభ్ పంత్‌(27 బ్యాటింగ్‌) కలిసి 3వ వికెట్‌‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో టీమిండియా తొలిరోజు ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. జయసూరియకు ఒక వికెట్‌ ‌లభించింది.

స్కోర్‌‌బోర్డు...

ఇండియా తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (‌రనౌట్‌)‌ప్రభాత్‌ ‌జయసూరియ/డిక్వెల్లా 32, కెఎల్‌ ‌రాహుల్‌ (‌రిటైర్డ్‌ ‌హార్ట్‌) 77, పడిక్కల్‌ (‌బ్యాటింగ్‌) 131, శుభ్‌‌మన్‌ ‌గిల్‌ (‌సి)లాహిరు ఉదాన (బి)ప్రభాత్‌ ‌జయసూరియ 16, రిషబ్‌ ‌పంత్‌ (‌బ్యాటింగ్‌) 27, అదనం 5. (73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి)288 పరుగులు. వికెట్ల పతనం: 1/47, 2/236 బౌలింగ్‌: ఫెర్నాండో 10-1-28-0, లాహిరు 10-1-51-0, నువాంత 21-0-98-0, జయసూరియ 24-4-77-1, ధనుంజయ 4-0-15-0, సొనాల్‌ ‌4-0-17-0.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్