ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2,000వ రోజు దీక్ష

1 గంట క్రితం

vizag steel.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకూడదని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2,000వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుడు ఎం. జగ్గి నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆదినారాయణ, ఐఎన్‌టీయూసీ నాయకులు నాగభూషణం, ఏఐటీయూసీ నాయకులు మన్మధరావు, వైఎస్సార్‌టీయూ నాయకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్