ఐచి–నాగోయాలో జరుగుతున్న టోర్నమెంట్‌లో భారత షూటర్ ఎలవెనిల్ వలరివాన్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. ఫైనల్లో 252.4 పాయింట్లు సాధించిన ఎలవెనిల్.. 253.0 పాయింట్లతో స్వర్ణం సాధించిన జపాన్‌కు చెందిన తైచి హినాతా కంటే 0.6 పాయింట్లు వెనుకబడింది. దక్షిణ కొరియాకు చెందిన బాన్ హ్యోజిన్ కాంస్యం సాధించారు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలోనూ ఎలవెనిల్ రజత పతకం సాధించింది. టీమ్ ఈవెంట్‌లో భారత్ 1,898 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
Asian Games: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఎలవెనిల్‌కు రజతం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)