ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం..

03 అక్టోబర్, 2026

టీచర్ల, లెక్చరర్ల సత్తా ఏమిటో చంద్రబాబుకు తెలియాలి 
- ఆరో రోజుకు చేరిన గురుకుల పార్ట్‌టైమ్ ఉద్యోగుల మహా ధర్నా
- పలు సంఘాల నాయకులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 08:12 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- పార్ట్ టైమ్‌ నుంచి కాంట్రాక్ట్ లోకి మార్చాల్సిందే

- సమస్యలను పరిష్కరించేంతవరకు ధర్నా చౌక్‌ నుంచి కదిలేది లేదు

- త్వరలో మంత్రులు నారా లోకేష్‌, శ్రీబాల వీరాంజనేయ స్వామి ఇళ్ల ముట్టడి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్ల ను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలి. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్‌ ‌ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్ట్ టైమ్‌ ‌టీచర్లు, లెక్చరర్లులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్ల నాలుగు నేలనైంది. మంత్రులు, ఎంపి, ఎంఎల్ఎ, అధికారులకు పలు మార్లు వినతిపత్రాలు ఇచ్చిన పట్టించుకోకపోవడంతో రాజధాని నడిబోడ్డున ధర్నాకు దిగాల్సి వచ్చింది. గత ఆరు రోజులుగా పిల్ల పాపలతో నిద్ర హారాలు లేకుండా ధర్నా చేస్తుంటే రాష్ట్ర మంత్రులు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పార్ట్ టైమ్‌ టీచర్లు, లెక్చరర్లు సమస్యలను పరిష్కరించేంత వరకు విజయవాడ ధర్నా చౌక్‌ నుంచి కదలిలేది లేదు.సమస్యలను పరిష్కరించాలని మంత్రులు నారా లోకేష్‌, శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఇళ్లను త్వరలో ముట్టడిస్తాం. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బిఆర్‌ అంబేద్కర్‌ ‌గురుకుల విద్యాలయాల పార్ట్ టైమ్‌ ‌టీచర్లు, లెక్చరర్లు ప్రకటించారు. వారి మాటల్లో...


‌యువగళం పాదయాత్రలో హామీని నెరవేర్చాలి

పార్ట్ టైమ్‌ ‌టీచర్లు, లెక్చరర్లు ను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చుతామని మంత్రి నారా లోకేష్‌ పల్నాడు జిల్లా మాచర్ల మండలం కారంపూడి గ్రామంలో యువగళం పాదయాత్రలో కలిసి వినతిపత్రం అందించిన సమయంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాగానే కాంట్రాక్టు విధానంలోకి మార్చుతామని హామీ ఇచ్చాని దాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. రెండేళ్లుగా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌‌సిని కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదు.

-పినపాటి యెసోబు, రాష్ట్ర కోర్‌ ‌కమిటీ సభ్యులు


ఉద్యోగ భద్రతా కల్పించాలి

పార్ట్ టైమ్‌‌గా ఐదేళ్లు పనిచేస్తే కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని సుప్రీం కోర్టు చెప్పింది. దాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళా పిడి, పిఇటిలు ఉదయం 5 గంటలు హాజరై. రాత్రి 8 గంటల వరకు పనిచేయాలని చెబుతున్నారు. ఉదయం నాలుగు గంటలకు లేచి వెళ్లాల్సిన పరిస్దితి ఉంటుంది. ఆ సమయం మహిళలకు గిరిజన ప్రాంతాల్లో చాలా కష్టంగా ఉంది. క్వార్టర్స్ లేవు. ఆరుగంటలకు హాజరవ్వాలని నిబంధలను అమలు చేయాలి. ప్రతి నెల జీతాలు అందించేలా చూడాలి. పార్ట్ టైమ్‌ ‌టీచర్లు, లెక్చరర్లును కాంట్రాక్ట్ విధానంలోకి మార్చేంతవరకు ఇక్కడినుంచి కదలం. ప్రభుత్వంతో తేడాపేడో తేల్చుకుంటాం. మా సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి పరిష్కరించాలి

-ఎం.సంతోషి కుమారి, పిడి, రాష్ట్ర నాయకురాలు


పేరుకే పార్ట్ టైమ్‌.. విధులు పుల్‌ ‌టైం

అంబేద్కర్‌ ‌గురుకుల పాఠశాలల్లో పేరుకే పార్ట్ టైమ్‌ ‌టీచర్లు, లెక్చరర్లు గా చెబుతున్నప్పటికీ పుల్‌ ‌టైమ్‌ ‌విధులను నిర్వర్తిస్తున్నాం. గత 15 ఏళ్లుగా 1631 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను భరించి పనిచేస్తున్నాం. ప్రభుత్వాన్ని గోంతెమ్మ కోర్కెలను కోరడం లేదు. ప్రభుత్వ నియమనిబంధనలు ప్రకారం కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని కోరుతున్నాం.

-మున్నేళ్లు గురురత్నం, రాష్ట్ర కోర్‌ ‌కమిటీ


సమస్యలను పరిష్కరించేంతవరకు ధర్నా చౌక్ నుంచికదిలేదిలేదు

గత ఆరు రోజులుగా రాజధాని నడిబోడ్డున గురుకుల పాఠశాలల టీచర్లు, లెక్చరర్లు పిల్ల పాపలతో ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు, కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. మహిళ ఉద్యోగులు వివిధ జిల్లాల నుంచి వచ్చి రాజధాని కేంద్రంలో ఎలా ఉంటున్నారో అన్న విషయం కూడా పట్టించుకోలేదు. పార్ట్ టైమ్‌ ‌నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలి. టీచర్లు, లెక్చరర్లుతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. లేని యడల విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉండి కదలకుండా పోరాటాలు చేస్తాం

-జిఎస్‌ ‌గిరిజారాణి, జాయింట్‌ ‌సెక్రటరీ, రాష్ట్ర కోర్‌ ‌ కమిటీ సభ్యులు,


మంత్రులు ఇళ్లను ముట్టడిస్తాం

పార్ట్ టైమ్‌ ‌నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చుతామని ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రత్యేక డిఎస్‌‌సి ద్వారా ఎంపికైన తాము పర్మినెంట్‌ ‌వారితో సమానంలో విధులను నిర్వర్తిస్తున్నాం. 2018 నుంచి ఉద్యోగుల అనేక సమస్యలు పెండింగ్‌ ‌లో ఉన్నాయి. మా సమస్యలను పరిష్కరించి పేద విద్యార్ధుల చదువు కుంటుపడకుండా చూడాలి. మంత్రులు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే త్వరలోనే మంత్రులు నారా లోకేష్‌, శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇళ్లను ముట్టడిస్తాం

-బోల్లిపోగు ఇస్మాయిల్‌, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు


ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం

పార్ట్ టైమ్‌ ‌టీచర్లు, లెక్చరర్లు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మంత్రులు, ఎంఎల్‌ఎలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఎస్‌‌సి కమిషన్‌ ‌ఛైర్మన్లను కలిసి విన్నవించాం. గతంలో 371 హెడ్‌ ‌ప్రకారం జీతాలు అందించడంతో సక్రమంగా అందేవి. 373 హెడ్‌ ‌కు మార్చడంతో జీతాలు సక్రమంగా రావడంలేదు. ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, సర్వీసు సర్టిఫికేట్లు ఇవ్వాలి. సమస్యలను పరిష్కరించేంతవరకు రాజధానిలో ఉండి పోరాటాలు చేస్తాం

-ఎం.జ్యోతి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్