సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్ ఉద్యోగుల చైతన్య యాత్ర ప్రారంభం

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 28న తిరుపతి ఎస్‌‌పిడిసిఎల్‌ వద్ద ముగింపు

ప్రజాశక్తి- విజయవాడ ​: విద్యుత్ సంస్థలో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మికుల చైతన్య యాత్ర సోమవారం ప్రారంభమైంది. విజయవాడ ప్రెస్‌‌క్లబ్‌ ‌వద్ద ఈ యాత్రను ఎపి జెఎసి చైర్మన్‌ ‌విద్యాసాగర్‌ ‌ప్రారంభించారు. ఈ యాత్ర ఈ నెల 28 వరకూ కొనసాగనుంది. తిరుపతి ఎస్‌‌పిడిసిఎల్‌ కార్యాలయం వద్ద ఈ యాత్ర ముగయనుంది. ఈ సందర్భంగా విద్యా సాగర్ మాట్లాడుతూ....విద్యుత్తు ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకు వెళ్తానని తెలిపారు. స్ట్రగులు కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రకు సంపూర్ణ మద్దత్తునిస్తూ సంఘీభావాన్ని ప్రకటించారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ... కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేయాలని, కనీస వేతనం రూ. 48,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎపి పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం మోహన్‌రావు మాట్లాడుతూ..పిఆర్‌‌సి కమిటీ వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్టు కార్మికులకు వేతన వ్యత్యాసం లేకుండా సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ చైతన్య యాత్రలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఎల్ రాజు, సిఐటియు ఎన్‌‌టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిపిడిసిఎల్ అధ్యక్ష, కార్యదర్శులు పి అనిల్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్