సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

rains: బంగాళాఖాతంలో వాయుగుండం..

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 4 రోజులు భారీ వర్షాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: పశ్చిమ, తూర్పుమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ - వాయువ్య దిశగా కదిలి, వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి పూరీకి 310 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 310 కిలోమీటర్లు, కళింగపట్నానికి 390 కిలోమీటర్లు, విశాఖపట్నంకు తూర్పున 470 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజాము సమయంలో తీవ్ర వాయుగుండంగా విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కాకినాడ జిల్లా శంఖవరంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నాటికి 60.7 మిల్లీమీటర్ల అత్యధిక వర్షం నమోదైనట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్