సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్పత్తి పతనం!

1 గంట క్రితం

mimimum
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:44 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కీలక రంగాల వృద్ధి మూడు నెలల కనిష్టానికి

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న వృద్ధి లెక్కలకు వాస్తవాలకు పొంతన లేని పరిస్థితి ఏర్పడుతోంది. తాజా గణాంకాలే దీనికి నిదర్శనం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధీనంలోని ఆఫీస్‌ ఆఫ్‌ ‌ది ఎకనామిక్‌ అడ్వైజర్‌ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తొమ్మిది కీలక రంగాల ఉత్పత్తి వృద్థి గణనీయంగా తగ్గింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌, ఇనుప ఖనిజం వంటి అత్యంత ముఖ్యమైనవి ఈ జాబితాలో ఉన్నాయి. గణాంకాల ప్రకారం మూడు నెలల కనిష్టానికి వీటి వృద్ధి పతనమైంది. ఈ తొమ్మిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి ఆగస్టులో 4.8 శాతంగా నమోదుకాగా, జులైలో ఇది 5 శాతంగా, జూన్‌లో 6 శాతంగా ఉంది. అంతేకాక గత ఏడాది ఆగస్టులో నమోదైన 6.2 శాతంతో పోలిస్తే ఈసారి వృద్ధి మరింత తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ తొమ్మిది రంగాలు కలిసి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అందువల్ల వీటి పనితీరు దేశ పారిశ్రా మిక రంగం మొత్తం స్థితిపై ప్రభావం చూపుతుంది.

gdp

పతనం ఎక్కడ...

ఆగస్టు గణాంకాలను ఒక్కసారి విడిగా చూస్తే, బొగ్గు, సహజ వాయువు, ముడి చమురు, ఎరువుల రంగాల క్షీణత మొత్తం సూచీపై ప్రతికూల ప్రభావం చూపింది. బొగ్గు ఉత్పత్తి ఆగస్టులో 3.8 శాతం తగ్గింది. జులైలో ఇదే రంగం 7.6 శాతం వృద్ధి నమోదు చేయడం గమనార్హం. అంటే నెల వ్యవధిలోనే బొగ్గు రంగం పనితీరులో భారీ మార్పు కనిపించింది. ముడి చమురు ఉత్పత్తి 3.6 శాతం, సహజ వాయువు 4.9 శాతం తగ్గాయి. ఎరువుల ఉత్పత్తి ఏకంగా 12.4 శాతం క్షీణించింది. ఇవన్నీ వ్యవసాయం, రవాణా, విద్యుత్‌ ఉత్పత్తి, తయారీ వంటి అనేక రంగాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుసంధానమై ఉం డటంతో రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది

ఆందోళనకరంగా ఇనుప ఖనిజం

పారిశ్రామిక వృద్ధికి అత్యంత కీలకమైన ఇనుప ఖనిజం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రంగం జులైలో ఏకంగా 29.5 శాతం వృద్ధి సాధిం చింది. అయితే ఆగస్టులో ఈ వృద్ధి 5.5 శాతానికి పడిపోయింది. దీంతో పారిశ్రామిక రంగంలో తీవ్ర అస్థిరత నెలకొందని, భవిష్యత్తులో ఇది మరింతగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. విద్యుత్, సిమెంట్‌ ‌వంటివి కొంత మెరుగైన పనితీరు చూపించినప్పటికీ మిగి లిన కీలక రంగాలు పతనోన్ముఖంగా ఉండటంతో ఉత్పత్తి వృద్ధి లెక్కలు పతనోన్ముఖంగా ఉన్నాయి.

ప్రభావం ఏమిటి?

జూన్‌లో 6% ఉన్న వృద్ధి జులైలో 5 శాతానికి, ఆగస్టులో 4.8 శాతానికి తగ్గడం.. పారిశ్రామిక రంగం వేగంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. కీలక రంగాల్లో ఈ పరిస్థితి ఇతర రంగాలపైనా పడే అవకాశం ఉంటుంది. కంపెనీల ఉత్పత్తి నిర్ణయాలు, ముడిసరుకు అవసరాలు, రవాణా, పెట్టుబడులు, ఉపాధి వంటి అంశాలు పెరగుతా యని, ఫలితంగా రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత తగ్గుతాయని, ధరలు పెరుగుతాయన్నఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. రానున్న నెలల్లో ఈ మందగమన ధోరణి కొనసాగుతుందా? లేక ఉత్పత్తి మళ్లీ పుంజుకుంటుందా? అన్నది కీలకంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్