సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుర‌జాడ సాహితీ సంప‌ద‌ను భావిత‌రాల‌కు అందించాలి

1 గంట క్రితం

gurajada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:58 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్

- ప్ర‌భుత్వ ఉత్స‌వంగా ఘ‌నంగా మ‌హాక‌వి 164వ జ‌యంతి

ప్రజాశక్తి - విజయనగరంకోట: న‌వ‌యుగ వైతాళికుడు గుర‌జాడ వెంక‌ట అప్పారావు సాహిత్యం శాశ్వ‌తంగా నిలిచి ఉంటుంద‌ని రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్‌, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. ఈ సంప‌ద‌ను భావిత‌రాల‌కు అందించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విజయనగరంలోని గురజాడ స్వగృహం, గురజాడ కాంస్య విగ్రహం వద్ద, కలెక్టరేట్లోనూ ‌సోమవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. గురజాడ స్వగృహంలోని గురజాడ విగ్రహానికి మంత్రి_కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గురజాడ స్వగృహం నుంచి గురజాడ కాంస్య విగ్రహం వరకు నిర్వహించిన గురజాడ గీతాలాపన ర్యాలీలోనూ ఆయన పాల్గొన్నారు. గురజాడ సాహిత్య, సామాజిక సంస్కరణల స్ఫూర్తిని ప్రతిబిం బించేలా ఈ కార్యక్రమం సాగింది. అనంతరం గురజాడ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ఆయన సాహిత్యాన్ని, సామాజిక సందేశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ గురజాడ రచనలు సమాజంలో చైతన్యాన్ని నింపి, ప్రజల్లో సామాజిక మార్పునకు బాటలు వేశాయన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. గుర‌జాడ కుటుంబ స‌భ్యుల‌ను స‌న్మానించారు. మ‌హారాజా సంగీత క‌ళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్_ఎస్.సేధు మాధవన్, గురజాడ అప్పారావు ముని మనవడు ప్రసాద్ రావు, ముని మనవరాలు ఇందిర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, లోక్ సత్తా ప్రతినిధి భీశెట్టి బాబ్జి, గురజాడ సమాఖ్య ప్రతినిధులు డాక్టర్ గోపాలరావు, డాక్టర్ వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్, వివిధ సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్