సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ల పోరాటం

1 గంట క్రితం

protes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిఆర్దీకి సామూహిక రాయబారం

అమరావతి: ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఎంటీఎంసీ పరిధిలోని ప్రాతూరు రోడ్డు రాయల్ ఓక్ వద్ద పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫీల్డ్ అసిస్టెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కే. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ర్యాలీగా రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం వైపు బయలుదేరారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్