ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు రాష్ట్ర వాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చినట్లు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నాగభూషణ, కె ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్మికుల జీతాల పెంపు, 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు డిఎ, మధ్యంతర భృతి వర్తింపజేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తోన్న 60 వేల మంది ఉద్యోగులు, కార్మికులు మూడేళ్లుగా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెంట్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, విద్యా, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు అమాంతంగా పెరిగిపోయాయని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి జరుగుతున్న ప్రదర్శనలు, ధర్నాల్లో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నేడు మున్సిపల్ కార్మికుల నిరసనలు
29 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)