ప్రజాశక్తి - ఉండ్రాజవరం : తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కొరకు వీఆర్ఏలు చేపడుతున్న ధర్నా గురువారం రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మోర్త వి ఆర్ ఎ ఎం.పద్మ మాట్లాడుతూ .. ఉద్యోగంలో చేరి 12 సంవత్సరాలు పూర్తికావస్తోందని, ఇప్పటికీ తమ జీతంలో పెరుగుదలేదని, కేవలం 10,500 జీతంతో జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ఈ జీతం పేరుతో వికలాంగురాలినైన తాను ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే అర్హత కోల్పోయానని, తనలాగే చాలామంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేయాలని, ప్రమోషన్ కల్పించాలని, నామినీలను రెగ్యులర్ చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. వి వీరాంజనేయులు, కె ఎల్లారిశ్వరి, టి శంకర్, జి సూర్యకుమారి. జి రాజాబాబు తదితర వి ఆర్ఏ లు పాల్గొన్నారు.
జీతం పెంచట్లేదు, సంక్షేమ పథకాలు అందట్లేదు : విఆర్‌ఎలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)