ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పెషల్ ఆఫీసర్, ఆర్ఎంసి కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం బొమ్మూరు పంచాయతీ పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజలతో చర్చించారు. అనంతరం గ్రామంలోని పారిశుధ్య పనులను పరిశీలించారు. వీధుల్లో చెత్త పేరుకుపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. దుకాణాలు, వ్యాపార సంస్థల వద్ద తప్పనిసరిగా డస్ట్ బిన్ లు ఉండేలా చూడాలన్నారు. సైడ్ కాలువల్లో మురుగు పారే విధంగా ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. నగరపాలక సంస్థ తరహాలోనే గ్రామాల్లోనూ పారిశుధ్య నిర్వహణను ఒక పక్కా ప్రణాళికతో అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చవచ్చన్నారు. ముఖ్యంగా జనాభా నిష్పత్తి ప్రకారం పారిశుధ్య కార్మికులు ఉండాలన్నారు. అలాగే ఎక్కడా త్రాగునీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఆయన వెంట శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఇతర పంచాయతీ అధికారులు, సిబ్బంది ఉన్నారు
పారిశుధ్య నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి : కమిషనర్ రాహుల్ మీనా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)