అబుజా : నైజీరియాలో కలుషిత డ్రింక్ తాగడంతో సుమారు 48 మరణించగా, 100మందికిపైగా ఆస్పత్రి పాలైనట్లు అధికారులు గురువారం తెలిపారు. ఒడిగ్బో, ఇర్లే ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో ఈ ఘటన జరిగిందని అన్నారు. డ్రింక్‌లో మిథనాల్ కలిసినట్లు అనుమానిస్తున్నారు. సుమారు 182మంది ప్రభావితమయ్యారని ఒండోకు చెందిన ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు. డ్రింక్ పరిమాణాన్ని అనుసరించి కిడ్నీలు ఫెయిలవడం, కంటిచూపు పోవడం, బ్రెయిన్ దెబ్బతినడం జరగవచ్చని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి 15మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఒండో రాష్ట్ర పోలీస్ ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని అన్నారు.








కామెంట్‌లు (0)