గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మండల స్థాయి సైన్స్ సెమినార్‌లో విద్యార్థుల ప్రతిభ

59 నిమిషాల క్రితం

ppm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మన్యం జిల్లా : మండల స్థాయి సైన్స్ సెమినార్ లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సెమినార్‌లో సిహెచ్‌. ఆరాధ్య జెడ్‌పిహెచ్‌ఎస్‌ నడిమికెళ్ళ ప్రధమ స్థానం, హెచ్‌. తిరుముల జెడ్‌పిహెచ్ఎస్‌ నీలానగరం ద్వితీయ స్థానం పొందారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047’ అనే అంశం పై అనర్గళంగా మాట్లాడి, పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ముఖ్య అతిధి మండలం విద్యాశాఖ అధికారి D. గౌరీనాయుడు ప్రధానోపాధ్యాయులు సోంబురా, కేపీ నాగమణి మండల సైన్స్ ఆఫీసర్ మరిసర్ల అప్పలనాయుడుల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. న్యాయ నిర్ణేతగా జూనియర్ కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ రామకృష్ణ వ్యవహారించారు. ముఖ్య అతిధి మాట్లాడుతూ.. నేటి సమాజంలో సైన్స్ ఆవశ్యకతను విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు సంపత్ కుమార్, జేమ్స్,వెంకటరావు వెంకటేష్, కేశవరావు, నానీబాబు ఇతర ఉపాధ్యాయులు సిఎమ్ఆర్టి లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్