గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో పారా మెడికల్ విద్యార్థుల ఆందోళన

2 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 02:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ : తమ ​సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పారా మెడికల్ విద్యార్థులు గురువారం విజయవాడ కొత్త ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ధర్నా చేపట్టారు. పారామెడికల్ విద్యార్థులకు నెలకు రూ.15 వేలు చొప్పున స్టయిఫండ్ అందించాలని డిమాండ్‌ చేశారు. మూడు సంవత్సరాల కోర్సును ఆరు సంవత్సరాలకు పొడిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ హాస్టల్, ఇతర వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్టయిఫండ్ అడిగితే నిధులు లేవని అంటున్నారని ముఖ్యమంత్రి, అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆగ్రహించారు. పైగా అధికారులు తమ కోర్స్ ను చెత్త కోర్స్ అంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నిధులు లేవని సాకులతో నాటకాలు ఆపాలని తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్యులు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు 8స్టార్ క్లాస్ బెడ్ రూములు కట్టడానికి, వారి జీతాలకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు రూ.15వేలు కూడా ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహించారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేంతవరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్