అమరావతి : ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద సామాజిక భద్రత పింఛన్లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఈ నెల 7న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. బుధవారం నాటికి 11.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా వృద్ధాప్య పింఛను కేటగిరీకి 6 లక్షలు, తర్వాత వితంతు కేటగిరీకి 2.61 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దివ్యాంగుల పింఛను కోసం 1.61 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. చర్మకారుల పింఛనుకు 40 వేల మంది, డప్పు కళాకారుల పింఛనుకు 32 వేల మంది, మత్స్యకారుల పింఛనుకు 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గీత కార్మికుల పింఛనుకు 13 వేలు, చేనేత పింఛనుకు 12 వేల దరఖాస్తులొచ్చాయి. ఒంటరి మహిళలకు 5 వేలు మంది, హిజ్రాల పింఛన్లకు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగతా దరఖాస్తులు ఇతర కేటగిరీల పింఛన్లకు వచ్చాయి.
ఏపీలో కొత్త పింఛన్ల కోసం 11.50 లక్షల దరఖాస్తులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)